|
| సచివాలయం డి-బ్లాకులో అగ్నిప్రమాదం |
| హైదరాబాద్, గురువారం, 7 మే 2009 ( 16:09 IST ) | |
సచివాలయంలోని డి-బ్లాకులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్- సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. డి-బ్లాకులోని రెండు, మూడు అంతస్తుల్లో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు, మూడు అంతస్థుల్లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. కరెంటు సరఫరా నిలిపివేయడంతో లిఫ్టులో కొందరు ఉద్యోగాలు చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తోంది.
కిటికీ అద్దాలను పగలగొట్టి మంటల్లో చిక్కుకున్న ఉద్యోగాలను బయకు తెచ్చారు. ఇద్దరు ఉద్యోగులు అగ్నిప్రమాదం కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. వారికి బయటవున్న 108 వాహనంలో చికిత్స అందించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఐటీ, అటవీ శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు దాదాపుగా దగ్ధమయ్యాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|