|
| ఆరోగ్యశ్రీ సర్వరోగనివారణి కాదు: చిరంజీవి |
| విశాఖపట్నం, గురువారం, 7 మే 2009 ( 16:02 IST ) | |
రాష్ట్రంలో జ్వరాలు, ఆంత్రాక్స్ బారినపడి వేలాది మంది గిరిజనులు మృతి చెందుతున్నారని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే, రాష్ట్రం జబ్బునపడినట్లు ఉందని చిరంజీవి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ సంజీవినీ కాదు.. సర్వరోగనివారణి కాదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్నారు. వేలాది ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
విశాఖ మన్యంలో ఒక్కరోజు పర్యటన ముగిసిన సందర్భంగా చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ.. ఏజెన్సీ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయన్నారు.
గిరిపుత్రలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానిక్నా.. అధికారంలో ఉన్న వైఎస్ సర్కారు రాజకీయ లబ్ది, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపరచడానికి చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|