|
| భోలక్‌పూర్ ఘటనపై స్పందించిన చిరు |
| హైదరాబాద్, బుధవారం, 6 మే 2009 ( 13:36 IST ) | |
హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌లో మంగళవారం కలుషిత నీరు త్రాగడం వల్ల కొందరు మరణించిన ఘటనపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తీవ్రంగా స్పందించారు. భోలక్‌పూర్ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
భోలక్‌పూర్ ఘటనపై మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకై కలెక్టర్, జలమండలి అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి బాధితులకు అందుతున్న సాయం గురించి వారిని ప్రశ్నించారు. అటుపై ఆయన మాట్లాడుతూ బాధితులకు సాయాన్ని అందించేందుకై ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలంటూ కోరారు.
దీని తర్వాత చిరంజీవి విశాఖ ఏజెన్సీ ప్రాంత పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విశాఖ మన్యంలో ఇటీవల విష జ్వరాలు చుట్టుముట్టి పలువురి ప్రాణాలు తీస్తున్న తరుణంలో అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|