యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఆర్టీసీకి మరోసారి లాభాలు: దినేశ్‌రెడ్డి
హైదరాబాద్, బుధవారం, 6 మే 2009   ( 11:59 IST )
గత రెండేళ్లుగా వరుసగా లాభాలను ఆర్జిస్తోన్న ఆర్టీసీ ఈ ఏడాది కూడా రూ. 100 కోట్ల లాభాన్ని ఆర్జించిందని సంస్థ ఎండీ దినేశ్‌రెడ్డి తెలిపారు. 2008-09 సంవత్సరానికిగాను ఫిబ్రవరి వరకు సంస్థ ఈ లాభాన్ని ఆర్జించినట్టు ఆయన తెలిపారు. దీంతోపాటు సంస్థ మరెన్నో అంశాల్లోనూ చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సాధించిన లాభాల కారణంగా ఆర్టీసీ టర్నోవర్ రూ. 4457 కోట్లనుంచి రూ. 5032 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. అలాగే సంస్థ ఆక్యుపెన్సీ రేషియో సైతం 69 శాతం నుంచి 72 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 1500 అత్యాధునికమైన ఆర్టీసీ బస్సులను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 360 కోట్ల నిధులతో ఈ బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజారెడ్డి హత్యకేసు: 11మందికి జీవిత ఖైదు
నిత్యావసర ధరలను అదుపు చేయండి: వైఎస్
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం: 12మంది మృతి
ఎవరికీ అపాయం లేదు: కలెక్టర్ ప్రకటన
భోలక్‌పూర్ ఘటనపై చంద్రబాబు విచారం
కృష్ణా జిల్లా పార్టీ నేతలతో చిరు సమావేశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...