యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రంలో రక్షణ కరువైంది: చంద్రబాబు ధ్వజం
నెల్లూరు, శుక్రవారం, 9 జనవరి 2009   ( 09:53 IST )
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం ఎక్కువైపోయిందని ఆయన పేర్కొన్నారు.

నెల్లూరులో గురువారం నిర్వహించిన రాజకీయ సమ్మేళనం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ సమ్మేళనం కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు రాఘవులు, నారాయణలతో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్ధేశించి మాట్లాడారు. కుంభకోణాల ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకే మహాకూటమి ఆవిర్భవించిందని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆహ్లాదకరమైన సాయంత్ర గడిపేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం ఏ పార్కుకో వెళితే ప్రాణాలతో తిరిగి వస్తామన్న గ్యారంటీ లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఎప్పుడు ఏ ముష్కరుల దాడికి గురవుతామోనని విద్యార్ధినులు అనుక్షణ భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రౌడీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దేశంలోని రౌడీలంతా రాష్ట్రానికే చేరుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిత్యావసరాల సరఫరాకు చర్యలు: ప్రభుత్వం
వారివి అనవసర ఆరోపణలు: కడియం శ్రీహరి
మేటాస్‌ ఛైర్మన్ పదవికి సిన్హా రాజీనామా
సత్యం కుంభకోణంపై ప్రభుత్వానిదే బాధ్యత: చిరు
సత్యం ఉద్యోగులకు బాసట: ముఖ్యమంత్రి
లారీల సమ్మెతో తీవ్రమవుతోన్న పెట్రోల్ కొరత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...