|
| నిత్యావసరాల సరఫరాకు చర్యలు: ప్రభుత్వం |
| హైదరాబాద్, గురువారం, 8 జనవరి 2009 ( 17:44 IST ) | |
లారీల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకై నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజల్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ విషయమై పౌరసరఫరాలశాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాలుగురోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె ప్రభావం నిత్యావసరాల రవాణాపై పడకుండా తాము అవసమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
అదేసమయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పెట్రోల్, డీజిల్ డీలర్ల సంఘం, ఆయిల్ ట్యాంకర్ల సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిసి తమకు రక్షణ కల్పిస్తే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని తెలిపారు. వీరి కోరికను విన్న మంత్రి మాట్లాడుతూ ఈ విషయమై ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|