|
| ఆడపిల్లలకు విదేశీ విద్య కూడా ఉచితం: చిరు |
| ఒంగోలు, గురువారం, 8 జనవరి 2009 ( 10:54 IST ) | |
ఆడపిల్లలకు చదివినంతవరకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా అవసరమైతే వారికి విదేశీ విద్యను కూడా ఉచితంగా అందిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లాలో ప్రజా అంకితయాత్ర సందర్భంగా చిరంజీవి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందరూపాయలకే వంటింటి సరుకుల పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీంతోపాటు తాము అధికారంలోకి వస్తే వృత్తి విద్యా కోర్సులతోపాటు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఆడపిల్లలకు ఉచిత విద్య అందిస్తామన్నారు.
అందరికీ విద్య, ఆరోగ్యం అందేలా చూడడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రజలకు వేరే గత్యంతరం లేకే రెండు పార్టీలకే అధికారాన్ని మార్చి మార్చి కట్టబెట్టారని ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజా ధనాన్ని దండుకుంటోందని విమర్శించారు. దీంతోపాటు అధికార ప్రభుత్వంపై ఆయన మరికొన్ని విమర్శలు సైతం ఎక్కుపెట్టారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|