యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తిరుమలలో శ్రీవారి భక్తులకు అష్టకష్టాలు
తిరుమల, గురువారం, 8 జనవరి 2009   ( 09:49 IST )
కలియుగ వైకుంఠంగా పేరు తెచ్చుకున్న తిరుమలలో కొలువైన శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎన్నడూ లేని విధంగా బుధవారం అష్టకష్టాలు ఎదురయ్యాయి. దీంతో అసహనానికి గురైన భక్తులు నిరసనలకు, ఆందోళనలకు దిగడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.

లెక్కకు మించి వీఐపీ దర్శనాలకు అనుమతులు మంజూరు చేయడంతో సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం ఈ పరిస్థితికి ప్రధానకారణం కావడం గమనార్హం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టీటీడీ లెక్కకు మించి వీఐపీ పాసులను మంజూరు చేసింది. దీంతో తెల్లవారు జామున దాదాపు 1.45 గంటలకు ప్రారంభమైన విఐపీ దర్శనం దాదాపు 5 గంటలవరకు కొనసాగింది.

అనంతరం సర్వదర్శనం ప్రారంభమైన సమయానికి లెక్కకు మించి సెల్లార్ టికెట్లను అనుమతించడంతో సర్వదర్శనం క్యూలైన్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో క్యూలైన్లలోని భక్తులు గంటల తరబడి నిలబడలేక ఇబ్బందులను తట్టుకోలేక చివరకు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో కొందరు భక్తులు క్యూలైన్ గేట్లను ఎక్కిదిగే ప్రయత్నం చేశారు.

అదేసమయంలో మంగళవారం రాత్రి నుంచి కంపార్ట్‌మెంట్లలో వేచియున్న భక్తులు సైతం సహనం కోల్పోయి గేట్లు ఎక్కి దిగే ప్రయత్నం చేశారు. ఇలా ఒక్కసారిగా అలజడి రేగడంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్యూలైన్లలోని భక్తులను అదుపుచేసి సర్వదర్శనం వేగంగా జరిగేలా చర్యలు చేపట్టారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టీఆర్ఎస్ (ఎన్) అధినేత నరేంద్రకు అస్వస్థత
రాష్ట్రంలో రోడ్‌షోలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సత్యంను పునరుద్ధించేందుకు ప్రయత్నం: రామ్
ఆ సంస్థలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: వైఎస్
విజయవాడ కేంద్రంగా నాస్తిక మహాసభలు
అల్లు కుటుంబం భూ వివాదం సర్వే వాయిదా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...