యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఆ సంస్థలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: వైఎస్
హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009   ( 17:11 IST )
అక్రమాలకు నిలయంగా మారాయంటూ రాష్ట్రంలో ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తోన్న సత్యం - మేటాస్ సంస్థలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికే మేటాస్ ప్రాపర్టీస్‌కు భారీ ప్రాజెక్టులు కేటాయించినందున వాటిపై ఎలాంటి ప్రభావం పడనుందో తాము పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఆయన మాట్లాడుతూ సత్యం కంప్యూటర్స్‌లో జరుగిన పరిణామాలు తీవ్ర దిగ్భ్రాంతిని కల్గిస్తున్నాయని అన్నారు. ఆ సంస్థ ఛైర్మెన్‌గా రాజీనామా చేసిన రామలింగరాజు మాటలు వింటుంటే సత్యం సంస్థలో ఏ మేరకు అవకతవకలు జరిగాయన్న విషయం తమకు అర్ధమవుతోందని ఆయన అన్నారు.

కంప్యూటర్ సేవల రంగంలో రాష్ట్రంలోనే ప్రముఖ సంస్థగా పేరొందిన సత్యం సంస్థ ప్రస్తుతం దివాళ అంచులకు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇన్నాళ్లు ఆ సంస్థ ఛైర్మన్‌గా కొనసాగిన రామలింగరాజు బుధవారం తన పదవికి రాజీనామా సమర్పించారు. దీంతో స్టాక్‌మార్కెట్‌లో ఆ సంస్థ షేర్ విలువ దారుణంగా పడిపోయింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విజయవాడ కేంద్రంగా నాస్తిక మహాసభలు
అల్లు కుటుంబం భూ వివాదం సర్వే వాయిదా
పదవతరగతి పరీక్ష ఫీజు ఆఖరు తేది జనవరి 21
కొత్త విధానంలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు
వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం: చంద్రబాబు
వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...