|
| విజయవాడ కేంద్రంగా నాస్తిక మహాసభలు |
| విజయవాడ, బుధవారం, 7 జనవరి 2009 ( 17:10 IST ) | |
ప్రపంచ నాస్తిక మహాసభలు మంగళవారం నుంచి విజయవాడలో ప్రారంభమైనాయి. ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వాన్ని నమ్మే వారు ఈ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. విజయవాడలోని స్థానిక సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సభలో పాల్గొనేందుకు దేశంలోని ప్రముఖులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాస్తికులు సైతం హాజరుకావడం విశేషం.
ఈ మహాసభలను జాతీయ నాలెడ్జ్ కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు పిఎం భార్గవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినట్టుగానే నాస్తిక ఉద్యమం కూడా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి నాస్తిక ఉద్యమకారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అలాగే ఐహెచ్ఈయూ మాజీ అధ్యక్షుడు లెవిప్రాగిల్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని మత గంధాలు అహింసను ప్రభోధిస్తున్నా మత పెద్దలు మాత్రం హింసను పెంచి పోషిస్తున్నారని వాటిని తిప్పికొట్టేలా నాస్తికులు ఉద్యయం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|