|
| కొత్త విధానంలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు |
| హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009 ( 12:47 IST ) | |
రానున్న గ్రూప్-2 ఇంటర్వ్యూలను కొత్త తరహాలో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. దీని ప్రకారం ప్రశ్నలు, సమాధానాలనే పాత విధానానికి స్వస్తి చెప్పి ఏదో ఓ అంశంపై అభ్యర్ధి చేసే చర్చ ద్వారా అతని సమర్ధతను నిర్వహించనున్నట్టు బోర్డు పేర్కొంది.
ఈ విషయమై కమిషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అభ్యర్ధి చురుకుదనం, శరీరభాష, నిజాయితీ, ప్రభుత్వ ఉద్యోగిగా అతను ఏమాత్రం సమర్ధుడు అన్న అంశాల ద్వారా అభ్యర్ధిని ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ రకమైన ఇంటర్వ్యూల సమయంలో గ్రేడుల ద్వారా అభ్యర్ధికి మార్కులు కేటాయిస్తామని ఆయన తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన గ్రూపు-2 రాత పరీక్షకు సంబంధించి ఫలితాలను గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వీటికోసం ఐదు బోర్డులను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|