|
| వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం: చంద్రబాబు |
| హైదరాబాద్, 7 జనవరి 2009 ( 12:36 IST ) | |
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికల్లో తమ పార్టీ మరో రెండు స్థానాలు గెల్చుకుని ఉంటే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాజీనామా చేసేవారని ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో నిర్వహించిన పార్టీ అనుబంధ సంఘాల వర్క్‌షాప్‌లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతో టీఆర్ఎస్ జతకట్టే అవకాశాలుండడంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
డబ్బు సంపాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి విలువలను నాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|