యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తీరప్రాంత రక్షణకు సహకరించండి: వైఎస్
న్యూఢిల్లీ, బుధవారం, 7 జనవరి 2009   ( 12:13 IST )
రాష్ట్రంలోని సుమారు వేయి కిలోమీటర్ల మేర పొడవైన తీరప్రాంత రక్షణ కోసం మరిన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తీరప్రాంతాల నుంచి పెను ప్రమాదం పొంచి ఉన్న రీత్యా ఇప్పుడున్న తీరప్రాంత రక్షణ బలగం రాష్ట్రానికి ఏమాత్రం సరిపోదని ఆయన పేర్కొన్నారు.

అంతర్గత భద్రతపై మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమైన ముఖ్యమంత్రుల సమావేశంలో వైఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అదనంగా 14 మెరైన్ పోలీస్ స్టేషన్లు కావాలని కేంద్రాన్ని కోరారు. అలాగే తీవ్రవాదాన్ని నిరోధించేందుకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం కోసం అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని తూర్పు తీర ప్రాంతంలో శ్రీహరికోట, తూర్పు నౌకాదళం, కేజీ బేసిన్‌లతో పాటు పలు చిన్న, పెద్ద నౌకాశ్రయాలున్నాయని వైఎస్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. వీటి రక్షణ కోసం తాము ఇప్పటికే ఆరు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అయితే తాము ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్లు రక్షణకు సంబంధించి ఏమాత్రం సరిపోవని ఆయన పేర్కొన్నారు. అందుకే తీరప్రాంత రక్షణ కోసం తాము అదనపు బలగం కోరుతున్నామని ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సామాజిక న్యాయమే పీఆర్‌పీ లక్ష్యం: చిరు
తిరుమలలో ఘనంగా తిరుమంజన సేవ
వైఎస్ ధరల సంగతిని విస్మరించారు: చిరంజీవి
కాంగ్రెస్ నేతలు వాగ్ధాన హీనులు: రాఘవులు
ఎయిడ్స్ రోగులకు ఫించన్‌లు: ఆనం
సమర్థులైన వారిని ఆదరిస్తాం: డీఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...