యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సామాజిక న్యాయమే పీఆర్‌పీ లక్ష్యం: చిరు
నెల్లూరు, బుధవారం, 7 జనవరి 2009   ( 11:02 IST )
సామాజిక న్యాయమే ప్రజారాజ్యం లక్ష్యమని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. తాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న కారణంగానే తుపాకుల మునెమ్మను చట్టసభలకు పంపాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు.

పొట్టశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజా అంకితయాత్ర పర్యటన సందర్భంగా మంగళవారం ఆయన కోవూరు, బుచ్చి, ఆత్మకూరు, వింజమూరు, కావలి సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నేతలు చేస్తున్న దురాగతాలను దుయ్యబట్టారు.

అధికారంలోని నేతలు తమ అవినీతి సంపాదన కోసం ప్రకృతిని సైతం వదలిపెట్టడం లేదని పేర్కొన్నారు. సరైన శాస్త్రీయ అధ్యయనం లేకుండా మేఘమథనం చేపట్టడమే ఇందుకు సాక్ష్యమని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు దూషించుకునే నేతలు తాము చేసిన పనులను ఏమాత్రం బయటపెట్టడం లేదని అన్నారు.

నేటి రాజకీయాలు నికృష్టంగా మారాయని ఇలాంటి రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే ప్రజారాజ్యం ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమకు ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని దాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని ఆయన అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తిరుమలలో ఘనంగా తిరుమంజన సేవ
వైఎస్ ధరల సంగతిని విస్మరించారు: చిరంజీవి
కాంగ్రెస్ నేతలు వాగ్ధాన హీనులు: రాఘవులు
ఎయిడ్స్ రోగులకు ఫించన్‌లు: ఆనం
సమర్థులైన వారిని ఆదరిస్తాం: డీఎస్
తెదేపా, వామపక్షాలతో తెరాస పొత్తు ఖరారు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...