యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తిరుమలలో ఘనంగా తిరుమంజన సేవ
పుణ్యక్షేత్రమైన తిరుమలలో కలియుగదైవమైన శ్రీ వేంకటనాధునికి కోయల్ ఆళ్వార్ తిరుమంజన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏడాదిలో నాలుగు సార్లు ఈ సేవలను ఉత్సవాలకు ముందు మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ సేవలో భాగంగా సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో శుద్ధి చేస్తారు.

ఇక బుధవారం వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామి వారి మూల విరాట్టుపై పట్టువస్త్రాన్ని కప్పి గర్భాలయంలో ఉన్న మిగిలిన దేవుళ్ల విగ్రహాలను వెలుపలకు తీసుకువచ్చి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు, ఈవో రమణాచారి, ఇతర ఆలయ ఉద్యోగులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నట్లు రమణాచారి వెల్లడించారు. ఏకాదశి రోజున 2 గంటలలోపు తోమాల, తిరుప్పావై, అర్చన తదితర సేవలను పూర్తి చేస్తామన్నారు. ఉదయం 3 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వైఎస్ ధరల సంగతిని విస్మరించారు: చిరంజీవి
కాంగ్రెస్ నేతలు వాగ్ధాన హీనులు: రాఘవులు
ఎయిడ్స్ రోగులకు ఫించన్‌లు: ఆనం
సమర్థులైన వారిని ఆదరిస్తాం: డీఎస్
తెదేపా, వామపక్షాలతో తెరాస పొత్తు ఖరారు
రాష్ట్రంలో రాజకీయ అవినీతి: చిరంజీవి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...