|
| వైఎస్ ధరల సంగతిని విస్మరించారు: చిరంజీవి |
ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి తామెంతో చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ధరల సంగతి మాత్రం విస్మరించారని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, నిత్యావసర వస్తువుల ధరలను సామాన్యునికి అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు.
ప్రజా అంకిత యాత్రలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా విలేకరులతో చిరు మాట్లాడుతూ, రైతుల పొలాలను తీసుకుని వాటిని సెజ్ (ఆర్థిక మండళ్లు)లకు కేటాయించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు మాత్రమే సెజ్ కేటాయింపులు చేయాలని.. తాము అధికారంలోకి వస్తే అదే చేస్తామన్నారు.
రానున్న ఎన్నికల కోసం తెలంగాణా రాష్ట్ర సమితితో పొత్తుకు యత్నిస్తున్నామని, అయితే ఆ పార్టీ లేకపోయినా తాము ముందుకెళ్లగలమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి నెగ్గ గల సత్తా తమ పార్టీకి ఉందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|