యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఫ్యాక్షనిజంపై వైఎస్, బాబుల వాగ్వాదం
హైదరాబాద్, గురువారం, 4 డిసెంబర్ 2008   ( 16:16 IST )
శాసనసభలో గురువారం ఫ్యాక్షనిజంపై ముఖ్యమంత్రి వైఎస్, ప్రతిపక్షనేత వైఎస్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా, స్పీకర్ సురేష్ రెడ్డి సభను సాయంత్రానికి వాయిదా వేశారు. మొదట దీనిపై ముఖ్యమంత్రి తన వాదనను విన్పించగా, ఆ తర్వాత చంద్రబాబు దానిని ఖండిస్తూ ప్రసంగిస్తున్న తరుణంలో సభ వాయిదా పడింది.

చెన్నారెడ్డి హయాంలో కడప నుంచి రౌడీలను తెచ్చి హైదరాబాద్‌లో అల్లర్లకు ప్రేరేపించినట్టు తనపై ఆరోపణలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై వేసిన కమిటీ చంద్రబాబు హయాంలో నివేదిక ఇవ్వగా, అందులో ఎక్కడా తన ప్రస్తావన రాలేదని గుర్తు చేశారు.

హత్యలు, ఫ్యాక్షన్లు తనకు పడవన్నారు. తన తండ్రిని చంపిన వారికి ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. టీడీపీ హయాంలో నక్సల్ సమస్యను అదుపు చేయని కారణంగానే మాధవరెడ్డి, చంద్రబాబులపై దాడులు జరిగాయని, తాము వచ్చి దానిని నిరోధించగలిగామని చెప్పారు.

అయితే ఆయన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు నాయుడు ఫ్యాక్షన్ విషయంలో సీఎం వైఖరి, ఆయన తండ్రి హత్యకు దారి తీసిన కారణాలన్నిటినీ ప్రజలకోసం తాము చెబుతామన్నారు. అయితే స్పీకర్ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వృథాగా సభను నిర్వహించడం కుదరదని చెబుతూ సాయంత్రం వరకు వాయిదా వేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాష్ట్రంలో వైఎస్ పాలన భేష్: అక్బరుద్దీన్ ప్రశంస
పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్‌ప్రెస్: 15 మందికి గాయాలు
సికింద్రాబాద్, కాకినాడల మధ్య 25 ప్రత్యేక రైళ్లు
ఎట్టకేలకు తిరువూరు యువకుడి విడుదల
అనంతపురం జైలులో పటోళ్లపై రేఖమయ్య దాడి
రోడ్‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...