|
| రాష్ట్రంలో వైఎస్ పాలన భేష్: అక్బరుద్దీన్ ప్రశంస |
| హైదరాబాద్, గురువారం, 4 డిసెంబర్ 2008 ( 14:05 IST ) | |
వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో ముస్లింలకు మేలు జరిగిందని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల కారణంగా ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలు పొందుతున్నారని ప్రశంసించారు. అలాగే ఉపకార వేతనాలు కూడా ఎందరో పేద విద్యార్థుల ఆశలను నెరవేరుస్తున్నాయని చెప్పారు.
శాసన సభలో ఉగ్రవాదంపై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్వయం ఉపాధి పథకాలు కూడా ముస్లిం యువతను ప్రగతిబాటన నడిపిస్తున్నాయన్నారు. వక్ఫ్ భూముల విషయంలోనూ తీసుకున్న చర్యలు, భైంసా అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు ప్రశంసనీయంగా ఉందని కొనియాడారు. టీడీపీ హయాంలో ముస్లింలకు ఏం చేశారని ప్రశ్నించారు.
అంతకుముందు బాబ్రీ మసీదు విధ్వంసం వల్లే దేశంలో తీవ్రవాదం పెరిగిందని పేర్కొన్నారు. దీనికి ఎన్డీఏ, టీడీపీలే బాధ్యత వహించాలన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ, బీజేపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆ రెండు పార్టీల శాసన సభ్యులకు, ఎంఐఎం సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|