యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్‌ప్రెస్: 15 మందికి గాయాలు
శ్రీకాకుళం, గురువారం, 4 డిసెంబర్ 2008   ( 12:21 IST )
శ్రీకాకుళం జిల్లాలో పాట్నా ఎక్స్‌ప్రెస్ బుధవారం అర్ధరాత్రి పట్టాలు తప్పగా, ఎనిమిది బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగాయి. సోంపేట- బారువాల మద్య ఉన్న లక్కవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 15మంది గాయపడగా, 108 సాయంతో వారిని అధికారులు సకాలంలో ఆస్పత్రికి తరలించారు.

ఎర్నాకుళం నుంచి పాట్నా వెళుతున్న ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పలాస స్టేషన్ నుంచి బయలుదేరిన అర్ధగంటకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రెండు ట్రాక్‌లు దెబ్బతినగా, విశాఖ- భువనేశ్వర్‌ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వాటిలో ఓ ట్రాక్‌ను ప్రస్తుతానికి సిద్ధం చేసి ప్రమాదానికి గురైన రైలులోని ప్రయాణీకులను ప్రత్యేక రైలులో పాట్నా తరలించారు. మరికొన్ని రైళ్లను రాయ్‌గఢ్ మీదుగా నడిపారు. క్షతగాత్రులను బీహార్, ఒరిస్సాలకు చెందిన వారుగా గుర్తించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సికింద్రాబాద్, కాకినాడల మధ్య 25 ప్రత్యేక రైళ్లు
ఎట్టకేలకు తిరువూరు యువకుడి విడుదల
అనంతపురం జైలులో పటోళ్లపై రేఖమయ్య దాడి
రోడ్‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ
చంద్రబాబుతో కేసీఆర్ రహస్య చర్చలు
జీవో 41,42ల రద్దుకై అంగన్‌వాడీ కార్యకర్తల దర్నా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...