|
| అనంతపురం జైలులో పటోళ్లపై రేఖమయ్య దాడి |
| అనంతపురం, గురువారం, 4 డిసెంబర్ 2008 ( 10:36 IST ) | |
పరిటాల హత్య కేసులో నిందితుడైన పటోళ్ల గోవర్థనరెడ్డిపై సహ నిందితుడు రేఖమయ్య దాడి చేశాడు. ఈ మేరకు పటోళ్ల తమకు ఫిర్యాదు చేశాడని జైలు సూపరింటెండెంట్ రవి ప్రసాద్ తెలిపారు. దానిని గురువారం కోర్టుకు సమర్పిస్తామన్నారు. ప్రస్తుతం వారిని వేర్వేరు సెల్‌లలో ఉంచినందున గోవర్ధనరెడ్డికి ప్రాణహాని లేదని చెప్పారు.
గోవర్ధనరెడ్డి కూడా ఇక్కడే ఉండేందుకు సమ్మతి తెలిపాడన్నారు. కేసు విచారణకోసం బుధవారం కోర్టులో హాజరు పరచి, జైలుకు తీసుకువెళ్ళిన సమయంలో ఈ దాడి జరిగిందని తెలిసింది. సూరికి వ్యతిరేకంగా పటోళ్ల నినాదాలు చేయడంతో రేఖమయ్యకు, ఆయనకు మధ్య గొడవ రేగింది. ఈ సందర్భంగా రేఖమయ్య ఆయనపై దాడి చేసినట్టు తెలిసింది.
కాగా మద్దెల చెరువు సూరితో తన కొడుకు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గోవర్ధనరెడ్డి తల్లి సుశీలమ్మ ఆరోపించారు. బుధవారం జరిగిన దాడి నేపథ్యంలో వికలాంగుడైన తన కుమారుడిని వెంటనే హైదరాబాద్‌లోని చర్లపల్లి లేక చంచల్ గూడ జైళ్లకు తరలించాలని ఆమె కోరారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|