|
| రోడ్‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ |
| హైదరాబాద్, 4 డిసెంబర్ 2008 ( 09:50 IST ) | |
రాజకీయ పార్టీల రోడ్‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు బుధవారం నిరాకరించింది. రాజకీయ పార్టీల షోలకోసం రోడ్లు వేయలేదని చెబుతూ స్టే తొలగించాలన్న టీడీపీ, తెరాస, ప్రజారాజ్యం పార్టీల విజ్ఞప్తులను తోసిపుచ్చింది.
రోడ్‌షోలను నియంత్రించాలని అభిప్రాయ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ ఆర్ దవే, జస్టిస్ సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రోడ్‌షోలను కాదనడం ద్వారా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు అని, సుప్రీంకోర్టు కూడా గతంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలకు అనుకూలంగా తీర్పు చెప్పిందని ప్రజారాజ్యం తరపు న్యాయవాది రఘునందన్ వాదించారు. హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు స్తంభించాయన్నారు.
తెరాస న్యాయవాది రామచంద్రారావు మాట్లాడుతూ రోడ్‌షోలకు చట్టబద్ధ నిర్వచనం లేదన్నారు. అలాగే టీడీపీ తరపున హాజరైన దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రైవేటు పార్టీలకు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు అన్నిపార్టీలకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|