యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
చంద్రబాబుతో కేసీఆర్ రహస్య చర్చలు
హైదరాబాద్, గురువారం, 4 డిసెంబర్ 2008   ( 09:33 IST )
టీడీపీ చీఫ్ చంద్రబాబుతో తెరాస చీఫ్ కేసీఆర్ బుధవారం రాత్రి రహస్య చర్చలు జరిపినట్టు తెలిసింది. చంద్రబాబు ఆహ్వానం మేరకు కేసీఆర్ ఆయన ఇంటిలో జరిగిన విందు సమావేశానికి హాజరైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు ఆయన మేనల్లుడు హరీష్‌రావు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయాలతో పాటు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశాలపై కూడా చర్చించారు. గెలుపు ప్రాతిపదికన ఇచ్చి, పుచ్చుకునే ధోరణితో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారని తెలిసింది. అలాగే పొత్తు విషయాన్ని ఎన్నికల ముందుగా ప్రకటిస్తే సరిపోతుందనే అభిప్రాయానికి వారు వచ్చారని వెల్లడైంది.

కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఇప్పటికే లెఫ్ట్ పార్టీలను కూడగట్టుకున్న టీడీపీ ప్రస్తుతం తెరాసను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓ వైపు ప్రజారాజ్యం కూడా తెరాసను తమతో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ విషయంలో టీడీపీ ఇప్పటికే అడుగు ముందుకేసిందని చెప్పవచ్చు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జీవో 41,42ల రద్దుకై అంగన్‌వాడీ కార్యకర్తల దర్నా
హుందాతనం మరచిన వైఎస్: బాబు ధ్వజం
కాల్పుల ఉదంతంతో సున్నిత ప్రాంతాల్లో అలెర్ట్
సిమి కార్యకర్త కాల్పులు: ఇద్దరు పోలీసులకు గాయాలు
రెండు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం
కరెంటు గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...