యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
జీవో 41,42ల రద్దుకై అంగన్‌వాడీ కార్యకర్తల దర్నా
హైదరాబాద్, గురువారం, 4 డిసెంబర్ 2008   ( 08:33 IST )
అంగన్‌వాడీలపై అధికారాన్ని పంచాయతీలకు అప్పగించడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు బుధవారం హైదరాబాద్‌లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించిన జీవో నెం.41, 42లను సవరించాలని డిమాండ్ చేశారు.

యూసుఫ్ గూడలోని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరక్టర్ కార్యాలయం వద్ద సీఐటీయు అనుబంధ అంగన్‌వాడీ కార్యకర్తల, సహాయకుల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. నాలుగుగంటల పాటు ధర్నా జరిగిన అనంతరం డైరక్టర్ కార్యాలయం లోనికి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సంఘం కార్యదర్శి ధనలక్ష్మి, ఓ హోంగార్డుకు గాయాలయ్యాయి. అనంతరం వారిని గోషామహల్‌కు తరలించారు. అంగన్‌వాడీ కార్యకర్తల అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హుందాతనం మరచిన వైఎస్: బాబు ధ్వజం
కాల్పుల ఉదంతంతో సున్నిత ప్రాంతాల్లో అలెర్ట్
సిమి కార్యకర్త కాల్పులు: ఇద్దరు పోలీసులకు గాయాలు
రెండు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం
కరెంటు గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు
విద్యుత్ కొరతపై బాబు ధ్వజం: విపక్షాల వాకౌట్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
యతార్థ సంఘటన ఆధారంగా కళాశాల
విద్యార్థుల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలతో రూపొందిన "కళాశాల" అనే చిత్రం త్వరలో...
కొత్త నటుడితో ఈతరం సినిమా
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...