|
| హుందాతనం మరచిన వైఎస్: బాబు ధ్వజం |
| హైదరాబాద్, గురువారం, 4 డిసెంబర్ 2008 ( 08:32 IST ) | |
శాసనసభలో తమ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేక ముఖ్యమంత్రి వైఎస్ హుందాతనం మరచి వ్యవహరిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని విమర్శించారు.
శాసనసభలో టీడీపీ సీనియర్ నేత నాగం జనార్ధనరెడ్డికి ఎలా గెలుస్తారో చూస్తామంటూ ముఖ్యమంత్రి సవాల్ విసరడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా కాక బజార్లలో పంచాయతీలు నిర్వహించే వ్యక్తిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలా ప్రవర్తిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పగలరనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమయ్యాయని చెప్పారు.
విద్యుత్ సరఫరాలో కూడా జిల్లాలపై వివక్ష చూపిస్తున్నారని దుయ్యబట్టారు. కడప జిల్లాలో 97వేల విద్యుత్ కనెక్షన్లకోసం ఏప్రిల్-ఆగస్టు మధ్య 585 యూనిట్లు సరఫరా చేయగా, చిత్తూరు జిల్లాలో ఇదే కాలంలో 2.33లక్షల కనెక్షన్లకు కేవలం 624 యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా చేయడం దీనిని బట్టబయలు చేస్తోందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|