|
| సిమి కార్యకర్త కాల్పులు: ఇద్దరు పోలీసులకు గాయాలు |
రాజధానిలోని సంతోష్‌నగర్ ప్రాంతంలో సిమి కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సంతోష్ నగర్‌లోని ఐఎస్ సదన్ చౌరస్తాలో ఉన్న ఓ హార్డ్‌వేర్ దుకాణం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ కొందరు తీవ్రవాదులున్నట్టు సమాచారం రావడంతో స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడకు వచ్చారు.
అయితే పోలీసులను చూడగానే తీవ్రవాదులు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారిద్దరిపైకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలవగా, వారిని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది.
దీనిపై సమాచారం అందిన వెంటనే డీజీపీ యాదవ్, కమిషనర్ ప్రసాదరావులు సంఘటనాస్థలికి చేరుకుని, పరిశీలన జరిపారు. అనంతరం గాయపడిన కానిస్టేబుళ్లను పరామర్శించారు. ఓ వైపు తీవ్రవాదుల బృందం కోసం సంతోష్ నగర్‌లో ఇంటిటిం సోదాలు నిర్వహిస్తుండగా, ప్రజలు పాకిస్తాన్ వ్యతిరేక ప్రదర్శనను నిర్వహించారు.
కాల్పులు జరిపింది ఐఎస్ఐ ఏజెంట్ వికారుద్దీన్ అని పోలీసులు గుర్తించారు. లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్టు భావిస్తున్న అతని కోసం గత రెండేళ్లుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గాలిస్తున్నారన్నది గమనార్హం. మక్కా మసీదు పేలుళ్లలో కూడా అతని ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|