|
| సీఎంచే మత్స్యదర్శిని ప్రదర్శనశాల ప్రారంభం |
| హైదరాబాద్, శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 15:59 IST ) | |
హైదరాబాద్‌లో రూ. కోటీ యాభై లక్షలతో మత్స్యదర్శిని పేరుతో ఏర్పాటు చేసిన అలంకరణ చేపల ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలంకరణ చేపలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకై ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మత్స్యశాఖ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ప్రసంగిస్తూ మత్స్యదర్శినిలో అలంకరణ చేపలను తక్కువ ధరలకు అందించనున్నామని తెలిపారు. అలంకరణ చేపల మార్కెటింగ్‌కు మంచి అవకాశాలున్నందున దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ప్రత్యేక దృష్టి సారించనుందన్నారు.
తమిళనాడులో ఇది కుటీర పరిశ్రమగా ఉన్న రీతిలో రాష్ట్రంలోనూ ఉండేలా ప్రోత్సహిస్తామన్నారు. ఇందులో భాగంగా అలంకరణ చేపల పెంపకంపై మేడ్చల్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|