|
| వైఎస్ ఆస్తులపై ప్రత్యేక విచారణ: బాబు |
| మహబూబ్‌నగర్, శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 12:37 IST ) | |
తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ ఆస్తులపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. వైఎస్‌కు 2004లో ఆస్తులకు, ప్రస్తుతం ఉన్న ఆస్తులకు మధ్య తేడా ఎలా వచ్చిందనే విషయాన్ని నిగ్గు తేల్చుతామని హెచ్చరించారు.
మహబూబ్ నగర్ జిల్లా, కోస్గిలో గురువారం జరిగిన మహాధర్నాలో ఆయన ప్రసంగిస్తూ పరిశ్రమలు, పత్రిక, టీవీ ఛానెల్ పెట్టే స్థాయికి ఎలా వచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబీకులు, అనుచరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తెలంగాణకు సాగునీరు అందిస్తామని చెబుతూ శంకుస్థాపన చేసిన చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రికి రూ. వెయ్యి కోట్ల మేర ముడుపులు అందాయన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|