|
| రాజధానిలో తొమ్మిది కొత్త బస్సులు: ఆర్టీసీ వెల్లడి |
| హైదరాబాద్, శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 11:59 IST ) | |
రాజధానిలో ప్రయాణీకుల రద్దీ సమస్యను పరిష్కరించేలా ఐదు కొత్త మార్గాల్లో బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి ఐదు, జీడిమెట్ల డిపో నుంచి మూడు, మియాబూర్ డిపో నుంచి ఒక కొత్త బస్సును శుక్రవారం నుంచి నడుపనున్నట్టు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ పురుషోత్తం నాయక్ తెలిపారు.
తన కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ పఠాన్ చెరువు నుంచి సికింద్రాబాద్‌కు 226 రూట్‌లో రెండు బస్సులు, పఠాన్ చెరువు నుంచి కోటీకి 218 రూట్‌లో మరో రెండు బస్సులు, పఠాన్ చెరువు నుంచి అశోక్ నగర్ మార్గంలో సికింద్రాబాద్‌కు 219 రూట్‌లో మరో బస్సు నడుస్తాయని తెలిపారు.
అలాగే జీడి మెట్ల నుంచి సీబీఎస్ వరకు 9 రూట్‌లో రెండు, జగద్గిరి గుట్ట నుంచి సికింద్రాబాద్‌వరకు 30 రూట్‌లో ఒకటి, లింగంపల్లి నుంచి కోఠికి 226 రూట్‌లో మరొక బస్సు నడుస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో రెండు ఏసీ బస్సులు నడుస్తుండగా, త్వరలో మరో రెండు ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|