యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పరిపాలనా సౌలభ్యం కోసం యాభై రాష్ట్రాలు
హైదరాబాద్, శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 11:15 IST )
పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని యాభై రాష్ట్రాలుగా విభజించాలని పాట్టాలి మక్కల్ కట్చి చీఫ్ రాందాస్ అన్నారు. ఇప్పటికే తాము ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశామని చెప్పారు.

నవ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ లెక్కలు- సామాజిక న్యాయం అంశంపై గురువారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌కు తాము ఇప్పటికే పలు పర్యాయాలు మద్దతు ప్రకటించానన్నారు.

దేశంలో ఓబీసీలు 91శాతం వరకు ఉండగా, 9శాతం మేర ఉన్న అగ్రకులాలే దేశాన్ని పరిపాలిస్తుండడం విచారకరమన్నారు. దీనిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు సైతం పోరాటం జరపాల్సి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, నవతెలంగాణ పార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్, ప్రజారాజ్యం పార్టీ నేత డాక్టర్ వినయ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రజా సమస్యలపై కలెక్టరేట్ల వద్ద లెఫ్ట్ ధర్నాలు
రైతుకు మేలు చేయడంలో నెదర్లాండ్ ఆదర్శం
ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసు కొట్టివేత
ఉస్మానియాలో మెడెక్స్ ప్రదర్శన ప్రారంభం
రామచంద్రయ్య ఫిరాయింపుపై టీడీపీ ఫిర్యాదు
రాష్ట్ర పోలీసుల అదుపులో బంగ్లా జాలర్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...