|
| ప్రజా సమస్యలపై కలెక్టరేట్ల వద్ద లెఫ్ట్ ధర్నాలు |
| హైదరాబాద్, శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 09:37 IST ) | |
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను గురువారం ముట్టడించాయి. పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూములు, అర్హులకు తెల్ల కార్డులు, పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ సీపీఎం, సీపీఐ పార్టీలు ఉమ్మడిగా ఈ ఆందోళనలు నిర్వహించాయి.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిపిన ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషాలు హాజరవగా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సీపీఎం ఎంపీ మధు, సీపీఐ శాసనసభా పక్షం నేత చాడ వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.
అలాగే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, అనంతపురంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణలు పాల్గొన్నారు. ఆందోళనను కొనసాగిస్తూ పలు చోట్ల వీధుల్లోనే వంటలు కూడా వండుకుని భోంచేశారు. ట్రాఫిక్‌కు కూడా కొద్ది పాటు అంతరాయం ఏర్పడ్డాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|