యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రైతుకు మేలు చేయడంలో నెదర్లాండ్ ఆదర్శం
కడప, శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 09:21 IST )
నెదర్లాండ్‌ను ఆదర్శంగా తీసుకుంటే రైతులు ఎలా లాభం పొందగలరో అర్థం కాగలదని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో అరుదుగా పండే కృష్ణాపురం ఉల్లికి ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాటిద్వారా రైతులు ప్రయోజనం పొందలేకపోతున్నారన్నారు.

కడప జిల్లాలో గురువారం జరిపిన రెండో రోజు ప్రజా అంకిత యాత్ర సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఏడాదిలో 15 రోజులు మాత్రమే పూచే ట్యూలిప్ పుష్పాలను శీతల గిడ్డంగులలో నిల్వచేసి, ప్రపంచం మొత్తానికి ఏడాది పొడవునా ఎగుమతులు చేయడం ద్వారా అక్కడి రైతులు మంచి లాభాలు పొందుతున్నారన్నారు.

శీతల గిడ్డంగుల ఏర్పాటు, దళారీ వ్యవస్థను రూపుమాపడం వంటి చిన్ని, చిన్న సమస్యలను పరిష్కరిస్తే రైతులు చక్కటి ప్రయోజనాలు పొందగలరని తెలిపారు. రైతులకు లాభసాటిగా ఉండే వాణిజ్య పంటల సాగుకు పెద్దపీట వేస్తామన్నారు.

సాగునీటి ప్రాజెక్టులను తాను వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఖండించిన చిరంజీవి అందులో అవినీతిని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రైతురాజ్య స్థాపనకు ప్రజారాజ్యం నడుం బిగిస్తుందని హామీ ఇచ్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసు కొట్టివేత
ఉస్మానియాలో మెడెక్స్ ప్రదర్శన ప్రారంభం
రామచంద్రయ్య ఫిరాయింపుపై టీడీపీ ఫిర్యాదు
రాష్ట్ర పోలీసుల అదుపులో బంగ్లా జాలర్లు
ఎన్నికల కమిషన్‌కు ప్రజారాజ్యం ఫిర్యాదు
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ బలి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...