|
| ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసు కొట్టివేత |
| హైదరాబాద్, గురువారం, 20 నవంబర్ 2008 ( 16:54 IST ) | |
పదిహేనేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసును నాంపల్లి కోర్టు మంగళవారం కొట్టివేసింది. తగిన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
కీలక నిందితుడైన నయీం అలీ తప్పించుకోగా, మరో ఇద్దరు నిందితులు శాఖమూరి అప్పారావు, బాలకృష్ణలు అజ్ఞాతంలోకి వెళ్లడంతో కేసును కొట్టివేస్తున్నామని కోర్టు ప్రకటించింది. నయీం అలీ మళ్లీ పట్టుబడితే కేసు విచారణను కొనసాగిస్తామని కోర్టు తెలిపింది.
1983, జనవరి 25న రాజధానిలోని లాల్ బహదూర్ స్టేడియంలో వాకింగ్ చేస్తుండగా, 21మంది ఆగంతకులు మూకుమ్మడిగా కాల్పులు జరపడంతో వ్యాస్ అక్కడికక్కడే మరణించారు. కొందరు ప్రధాన నిందితులు ఇప్పటికే వివిధ ఎన్‌కౌంటర్లలో హతమవగా, పోలీసులు హాజరుపరచిన కొందరు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|