|
| ఉస్మానియాలో మెడెక్స్ ప్రదర్శన ప్రారంభం |
| హైదరాబాద్, 20 నవంబర్ 2008 ( 16:40 IST ) | |
ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు మెడెక్స్-2008 పేరుతో వైద్య ఆరోగ్య ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ప్రజల్లో వైద్యం, ఆరోగ్యం గురించి అవగాహనను పెంపొందించేందుకై ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ప్రదర్శనకు ప్రవేశ రుసుంగా పిల్లలకు పదిహేను రూపాయలను, పెద్దలకు ఇరవై రూపాయలను నిర్ణయించామన్నారు.
ఆరోగ్య అవగాహన, మానవ అవయవ భాగాలు, ఆపరేషన్లు నిర్వహించే తీరు, ఫోరెన్సికల్ సైన్స్ తదితర విషయాలపై స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పిల్లలకోసం రసాయనాలతో అద్భుతాలు, అస్థిపంజరాల నృత్యాలు, భీభత్స ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ప్రదర్శన నవంబర్ 30 వరకు కొనసాగుతుందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|