యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఎన్నికల కమిషన్‌కు ప్రజారాజ్యం ఫిర్యాదు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 14:53 IST )
పులివెందులలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి సంఘటనపై ప్రజారాజ్యం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ తరహా దాడులను అడ్డుకోవాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ వెళ్లిన ఆ పార్టీ నేతలు శివశంకర్, తమ్మినేని సీతారాం, పరకాల ప్రభాకర్‌లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలస్వామితో సమావేశమై ఓ వినతిపత్రం సమర్పించారు. పులివెందుల ఘటనను, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఆయనకు ఈ సందర్భంగా వివరించారు.

అనంతరం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న రాజకీయ పరిస్థితులతో ఎన్నికల నిర్వహణ కష్ట సాధ్యమనే విషయాన్ని తాము ఎన్నికల కమిషనర్‌కు వివరించామని తెలిపారు. ఆయన కూడా దీనిపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారన్నారు.

పులివెందులలో చిరంజీవి రోడ్‌షోకు ముందురోజైన మంగళవారం సాయంత్రం కొందరు అల్లరి మూకలు ప్రజారాజ్యం పార్టీ నేతలు బస చేసిన అతిథి గృహం వద్ద నానా రభస చేసి, వాహనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇది కాంగ్రెస్ కార్యకర్తల పనేనని పీఆర్పీ ఆరోపించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ బలి
చిరు రోడ్‌షోలో మళ్లీ విషాదం: ఇద్దరు బలి
శబరిమలకు ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌ను వదులుకునేది లేదు: కేసీఆర్
చిరుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుకు ఆదేశం
లెఫ్ట్ తోడుంటే విజయం మాదే: బాబు ధీమా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...