|
| బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత: 144సెక్షన్ అమలు |
| హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008 ( 13:42 IST ) | |
బాబ్లీ ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం 144సెక్షన్ జారీ చేసింది. ఓ వైపు టీడీపీ నేతలు, వారిని అడ్డుకునేందుకు బాబ్లీ పరిరక్షక సమితి నేతలు బాబ్లీ బయలుదేరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ బృందం ఇప్పటికే మిగిలిన ప్రాజెక్టులన్నిటినీ సందర్శించి, చివరగా బాబ్లీకి బయలు దేరింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం వారిని అక్కడకు వెళ్లకుండా అడ్డుకునేలా 144వ సెక్షన్ అమలు చేసింది.
ధర్మాబాద్, బిలోలి వద్ద భారీగా పోలీసులను మోహరించినప్పటికీ, టీడీపీ నేతలు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ బృందంలో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, వరంగల్ ఎంపీ దయాకర్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|