యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పులివెందులలో పీఆర్పీ నేతల వాహనాల ధ్వంసం
పులివెందుల, బుధవారం, 19 నవంబర్ 2008   ( 10:18 IST )
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో చిరంజీవి రోడ్‌షో కోసం ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ నేతల వాహనాలను కొందరు అల్లరిమూకలు మంగళవారం ధ్వంసం చేశారు. దీంతో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, నేతలు పరుగులు తీశారు.

రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించేందుకై మంగళవారం పులివెందుల వచ్చిన పార్టీ నేతలు కోటగిరి విద్యాధరరావు, శోబా నాగిరెడ్డిలు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బసచేశారు. కార్యకర్తలు పార్టీ ఫ్లెక్సీబ్యానర్లు, రిబ్బన్లు అలంకరిస్తుండగా, దుండగులు వాటిని చించి వేశారు.

మరోవైపు ప్రచార సామగ్రి తరలింపుకోసం పది ఆటోలు తీసుకురాగా, దుండగులు భయపెట్టడంతో వారు కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఇది జరుగుతుండగానే 15 మంది దుండగులు పార్టీనేతలు బస చేసిన అతిథి గృహానికి వచ్చి నేతల వాహనాలను ధ్వంసం చేశారు. వారి దాడిలో మూడు స్కార్పియోలు, ఓ సఫారీ, ఓ ఇన్నోవా, ఓ మారుతీ, ఓ ఆటో అద్దాలు పగిలిపోయాయి.

ఈ సంఘటనతో భయభ్రాంతులైన మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి పరారవగా, ప్రజారాజ్యం పార్టీ నేతలు బంగాళాలోపలికి చేరుకుని, గదికి గడియ పెట్టుకున్నారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ దాడికి నిరసనగా కడపలో ఆ పార్టీ నేతలు మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టెక్నాలజీతో వైఎస్‌ పాలనకు చరమగీతం: బాబు
ఓటు హక్కుతో అవినీతి అంతం: చిరు
హైదరాబాద్‌లో 20న బీసీల సదస్సు: గౌడ్
ఉమెన్స్ హాస్టల్‌లో చొరబడిన మెడికోపై వేటు
అనంతలో చివరి రోజు చిరు యాత్ర షురూ
బస్సు దూసుకెళ్లి పది విద్యార్థులకు గాయాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...