|
| టెక్నాలజీతో వైఎస్ పాలనకు చరమగీతం: బాబు |
| హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008 ( 09:43 IST ) | |
టెక్నాలజీతో వైఎస్ పాలనకు చరమగీతం పాడాలని ఐటీ నిపుణులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునిచ్చారు. పొలిటికల్ చాటింగ్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ సందేశాల ద్వారా ఒకరినొకరు ప్రచారం చేసుకుంటూ వైఎస్‌ను గద్దె దించాలని సూచించారు.
పార్టీ అనుబంధ విభాగమైన తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం (టీఎస్‌ఎన్‌వీ)ని హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేనేళ్ల క్రితమే ఐటీ, బయోటెక్నాలజీ రంగాలను తాను ప్రోత్సహించానని గుర్తు చేశారు.
గ్రామీణ యువత ఐటీ, బయోటెక్ రంగాల్లో రాణించేందుకు తాము కృషి చేశామన్నారు. తమ పార్టీ విధానాల కారణంగా ప్రస్తుతం ఆంధ్ర నుంచి అమెరికాకు ఫోన్ ఉచితంగా మారిందని చెప్పారు. సైబరాబాద్ ఏర్పాటు ఘనత కూడా తమదేనన్నారు.
ఈ సందర్భంగా టీఎస్‌ఎన్‌వీ చీఫ్ పాళెం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును సీఎం చేసేందుకై తాము గట్టికృషి చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో నెలరోజుల పాటు తాము గ్రామాలకు వెళ్లి ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|