|
| ఓటు హక్కుతో అవినీతి అంతం: చిరు |
| గుత్తి, బుధవారం, 19 నవంబర్ 2008 ( 09:17 IST ) | |
ఓటు హక్కుతో అవినీతిని అంతమొందించాలని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి పిలుపునిచ్చారు. వ్యవస్థీకృతమై పోయిన అవినీతిని పారద్రోలేందుకు ఓటు హక్కును ఆయుధంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లాలో చివరి రోజు రోడ్‌షో జరిపిన చిరంజీవి గుత్తిలో ప్రసంగిస్తూ చెమటోడ్చి కష్టపడుతున్న రైతన్నకు ప్రకృతి అన్యాయం చేస్తుందనడం కన్నా అవినీతే అన్యాయం చేస్తోందని చెప్పవచ్చన్నారు.
విత్తనాల పంపిణీలో అవినీతి, నాణ్యత లోపం, కృత్రిమంగా ఎరువులు, పురుగు మందుల కొరత, నిర్వహణ లోపంలతోనే రైతులు దారుణంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రైతులకు తక్షణ పరిహారంగా ఎకరాకు రూ. 3వేలు అందించాలని డిమాండ్ చేశారు. మార్పు కోసం సీమ పౌరుషాన్ని కాగనిచ్చి, సత్తా చాటండి అని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|