యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఉమెన్స్ హాస్టల్‌లో చొరబడిన మెడికోపై వేటు
వరంగల్, మంగళవారం, 18 నవంబర్ 2008   ( 15:14 IST )
వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల హాస్టల్‌లో అక్రమంగా చొరబడిన ఫైనలియర్ మెడికో అశ్విన్‌ను సస్పెండ్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వాచ్‌మెన్‌లను కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.

తన జూనియర్ అయిన ఓ అమ్మాయిని కలుసుకునేందుకై సోమవారం రాత్రి హాస్టల్ గోడదూకి అక్రమంగా ప్రవేశించిన అశ్విన్‌ను విద్యార్థినులు పట్టుకుని ఓ గదిలో బంధించి, పోలీసులకు సమాచారం అందించారు. అంతలో అతనిని వాచ్‌మెన్‌లు తప్పించారు.

ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వార్త ప్రసారం కావడంతో రంగంలో దిగిన ప్రిన్సిపల్ వారు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు కూడా ఆదేశించారు.

గతంలో ఓ విద్యార్థినితో ఘర్షణ పడిన కారణంగా హాస్టల్ నుంచి గెంటి వేయబడిన అశ్విన్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని హాస్టల్లో ఉంటున్నాడన్నది గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అనంతలో చివరి రోజు చిరు యాత్ర షురూ
బస్సు దూసుకెళ్లి పది విద్యార్థులకు గాయాలు
రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సు ప్రవేశం
రిజర్వేషన్ల పెంపుతో పెను ముప్పు: లోక్‌సత్తా
చిరుకు లేఖాస్త్రం వాస్తవమే: జోగయ్య
దక్షిణ తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...