|
| ఎస్సీలలోకి రజకులు: చంద్రబాబు హామీ |
| హైదరాబాద్, మంగళవారం, 18 నవంబర్ 2008 ( 09:15 IST ) | |
తాము అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీలలోకి చేరుస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టినా తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు.
హైదరాబాద్‌లో సోమవారం జరిగిన రజక గర్జన సదస్సులో రజకుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే రజకులకు ఎకరా భూమి చొప్పున పంచుతామని, జిల్లాకు ఓ ఆశ్రమ పాఠశాల నిర్మాణం చేపడుతామని తెలిపారు.
రజక సమాఖ్యకు రూ.50కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని, లోయర్ ట్యాంక్ బండ్‌లో మూడెకరాల స్థలంలో మూడంతస్తుల రజక సంక్షేమ భవనం నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాస శాసనసభా పక్షం నేత ఈటెల రాజేందర్, అఖిల భారత దోభీ సమాజ్ మహాసంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు బాలాజీ షిండే తదితరులు కూడా పాల్గొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|