|
| కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప ఎవరికైనా సై: బీజేపీ |
| కరీంనగర్, సోమవారం, 17 నవంబర్ 2008 ( 16:58 IST ) | |
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మినహాయించి మరే ఇతర రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రకటించారు. అయితే భావసారూప్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
కరీంనగర్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము అధికారం చేపట్టి, ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణ ఏర్పడగలదన్న భ్రమ నుంచి కేసీఆర్ బయటకు రావాలని చెప్పారు.
లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే టీడీపీకి చేరువవుతున్నట్టు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో ప్రజారాజ్యంతో పొత్తుకు గట్టిగా ప్రయత్నిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చివరి నిమిషంలో చిరు మనసు మార్చుకుని తమతో పొత్తుకు రావచ్చని ఆ పార్టీ భావిస్తున్నట్టు చెబుతున్న తరుణంలో బీజేపీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|