యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
డిసెంబర్‌లో తానా చైతన్య స్రవంతి ఉత్సవాలు
హైదరాబాద్, సోమవారం, 17 నవంబర్ 2008   ( 16:14 IST )
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి-2008 సాంస్కృతిక ఉత్సవాలను డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 20-27 తేదీల మధ్య వీటిని ఏలూరు, విజయవాడ, తెనాలి, హైదరాబాద్‌లలో నిర్వహించనున్నారు.

తానా సౌత్ ఈస్ట్ ఉపాధ్యక్షుడు అడుసుమిల్లి రతీష్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ 20,21 తేదీలలో ఏలూరు సీఆర్ఆర్ కళాశాల ఆవరణలో జానపద కళోత్సవాలు, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తామని, జానపద కళలపై పరిశోధనలు చేసిన వారిని సత్కరిస్తామని తెలిపారు.

అలాగే 22న తెనాలిలో జరిగే కార్యక్రమంలో ఎన్నారై మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహిస్తామని 24న విజయవాడ శేషసాయి మండపంలో విద్య, వైద్య, సాంస్కృతిక రంగాల సదస్సులు, సంగీత దర్శకులతో విభావరిని నిర్వహిస్తామని వెల్లడించారు.

చివరగా హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో తెలుగుభాషకు ప్రాచీన హోదా వచ్చేందుకై కృషి చేసిన వారిని సత్కరిస్తామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విశాఖ ఎస్పీ ఎదుట 31 మావోయిస్టుల లొంగుబాటు
భారీ జాబితాతో తెరాస కార్యవర్గం
అల్పపీడనంగా మారిన వాయుగుండం
కృష్ణ, ఇళయరాజాలకు ఎన్టీఆర్ అవార్డులు
సంక్షేమ పథకాల్లో అవినీతిని తొలగిస్తాం
గోరంట్లలో చిరు రాయలసీమ యాత్ర ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...