|
| అల్పపీడనంగా మారిన వాయుగుండం |
| కావలి, 17 నవంబర్ 2008 ( 11:39 IST ) | |
కోస్తాపై తీవ్ర ప్రభావం చూపిన ఖైముఖ్ క్రమంగా బలహీనపడి ఈ వాయుగుండం అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద తీరాన్ని దాటింది. ప్రస్తుతం నంద్యాల వద్ద కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
దీని ప్రభావంతో వచ్చే 12 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది. అల్పపీడన ప్రభావం తగ్గుముఖం పట్టినందున చేపలవేటకు సంబంధించి జారీ చేసిన హెచ్చరికలను కూడా తొలగించామని వెల్లడించింది.
కాగా ఈ అల్పపీడన ప్రభావంతో కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంటనష్టం జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే త్వరగానే అది తీరం దాటడంతో కొంతవరకు కోలుకోగలిగామని రైతులు ఊరట చెందుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|