యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
బైంసాలో ఆరుగురి సజీవ దహనం
ఆదిలాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008   ( 17:07 IST )
మతపరమైన అల్లర్ల కారణంగా గత కొన్నిరోజులుగా ఉద్రిక్తత రాజ్యమేలుతున్న బైంసా పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో ఆదివారం ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వాటోలీ గ్రామంలో మైనారిటీ వర్గానికి చెందిన ఒక ఇళ్లు ఆదివారం 02.00 గంటల సమయంలో మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో ఇంటిలోని ఆరుగురు సభ్యులు సజీవ దహనమయ్యారు. బైంస్లా పట్టణానికి ఈ గ్రామం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ముగ్గురి మృతదేహాలు పూర్తిగా కాలిపోగా, మరో మూడు మృతదేహాలు పాక్షికంగా కాలిపోయాయి. పోలీసులు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకుతీసి, పోస్ట్‌మార్టానికి పంపారు. మత విద్వేషాల కారణంగా ఈ సంఘటన జరిగిందని ఇప్పుడే చెప్పలేమని జిల్లా కలెక్టర్ అహ్మద్ నదీం తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తరువాతే ఈ దుర్ఘటన జరగడానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు.

ఇదిలా ఉంటే బైంసాలో దుర్గమాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ హింసాకాండలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. అప్పటినుంచి బైంసా పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అవినీతి విష వృక్షాన్ని పెకలిస్తాం: చిరంజీవి
సీతారాం ఏచూరితో అల్లు అరవింద్ చర్చలు
పరిశ్రమల పేరుతో పరాధీనానికి పీఆర్పీ నో
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బంద్‌తో ఉద్రిక్తత
ఘర్షణలతో నలుగురి బలి: భైంసాలో కర్ఫ్యూ
పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ: చిరంజీవి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...