యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బంద్‌తో ఉద్రిక్తత
ఆదిలాబాద్, శనివారం, 11 అక్టోబర్ 2008   ( 13:11 IST )
భైంసా‌లో దుర్గాదేవి నిమజ్జనోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న మత ఘర్షణల్లో నలుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బంద్ సాగుతుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

కొన్ని చోట్ల పెద్దగా స్పందన లేనప్పటికీ, కీలక ప్రదేశాల్లో మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతుండటంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమస్యాత్మక ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు బలగాల్ని మోహరించారు.

శుక్రవారం జరిగిన దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకోవడంతో నలుగురు దుర్మరణం చెందగా, ఉద్రిక్తత కొనసాగుతుండడంతో అక్కడ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలతో శుక్రవారం ఉదయం నిమజ్జనోత్సవం నిర్వహించగా, మధ్యాహ్నానికి ఆ ఉత్సవం పంజాషా చౌక్ వద్దకు చేరుకుంది.

మరో వర్గానికి చెందిన వారు అక్కడ ఉన్న ప్రార్థనా మందిరం నుంచి బయటకు వస్తుండగా, ఈ ఉత్సవ కార్యకర్తలు చల్లిన పసుపు, కుంకుమలు వారిపై పడటంతో గొడవ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా మాటామాటా పెరిగి, చివరకు ఘర్షణకు దారితీయగా, ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ, పెద్ద పెద్ద బండలు, కత్తులతో దాడులకు దిగగా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.

ఎస్‌ఐ సహా ఇరవై మంది గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చివరకు పోలీసులు కాల్పులు జరిపి వారిని వేరు చేసినప్పటికీ, ఆ తర్వాత పట్టణంలో రేగిన హింసలో పలు దుకాణాలకు అల్లరిమూకలు నిప్పంటించారు.

పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, కర్ఫ్యూ కారణంగా పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఘర్షణలతో నలుగురి బలి: భైంసాలో కర్ఫ్యూ
పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ: చిరంజీవి
సీపీఐ నేతలతో తెరాస చీఫ్ కేసీఆర్ భేటీ
ప్రజారాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా
టీడీపీని కాంగ్రెస్ విమర్శించడం తగదు: బీజేపీ
చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ ద్వారా థ్యాంక్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...