|
| ఘర్షణలతో నలుగురి బలి: భైంసాలో కర్ఫ్యూ |
| బైంసా, 11 అక్టోబర్ 2008 ( 11:56 IST ) | |
ఆదిలాబాద్ జిల్లా, భైంసా పట్టణంలో శుక్రవారం జరిగిన దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకోవడంతో నలుగురు దుర్మరణం చెందగా, ఉద్రిక్తత కొనసాగుతుండడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలతో శుక్రవారం ఉదయం నిమజ్జనోత్సవం నిర్వహించగా, మధ్యాహ్నానికి ఆ ఉత్సవం పంజాషా చౌక్ వద్దకు చేరుకుంది. మరో వర్గానికి చెందిన వారు అక్కడ ఉన్న ప్రార్థనా మందిరం నుంచి బయటకు వస్తుండగా, ఈ ఉత్సవ కార్యకర్తలు చల్లిన పసుపు, కుంకుమలు వారిపై పడటంతో గొడవ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మాటామాటా పెరిగి, చివరకు ఘర్షణకు దారితీయగా, ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ, పెద్ద పెద్ద బండలు, కత్తులతో దాడులకు దిగగా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఎస్‌ఐ సహా ఇరవై మంది గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చివరకు పోలీసులు కాల్పులు జరిపి వారిని వేరు చేసినప్పటికీ, ఆ తర్వాత పట్టణంలో రేగిన హింసలో పలు దుకాణాలకు అల్లరిమూకలు నిప్పంటించారు.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, కర్ఫ్యూ కారణంగా పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|