|
| పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ: చిరంజీవి |
| శ్రీకాకుళం, శనివారం, 11 అక్టోబర్ 2008 ( 11:43 IST ) | |
పొత్తులతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం తాను చేపట్టిన యాత్ర పూర్తయిన తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకోగలమన్నారు. అంతవరకు మిత్ర పక్షాలు వేచి చూడగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యంను ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక స్థితికి కూడా ప్రాధాన్య ముంటుందన్న హరిరామ జోగయ్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు.
ఎన్నికలు ఏ సమయంలో జరిగినా తామే విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. నక్సలిజం శాంతి, భద్రతల సమస్య కాదన్నారు. తాను సామాజిక న్యాయం కోసం పని చేస్తున్నాననే విషయాన్ని వారు అర్థం చేసుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|