|
| చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్ ద్వారా థ్యాంక్స్ |
| హైదరాబాద్, శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 15:58 IST ) | |
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకై టీడీపీ చీఫ్ చంద్రబాబును తెరాస చీఫ్ కేసీఆర్ టెలిఫోన్ ద్వారా అభినందించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని ఆయన అన్నారు.
అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నందున దీనిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంతకాలం టీడీపీని ప్రశ్నిస్తూ వచ్చిన కాంగ్రెస్ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించాలని సూచించారు.
కాంగ్రెస్‌ను ఎదుర్కునేందుకై తెలంగాణ ప్రాంతంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరవచ్చనే సంకేతాల మధ్య ఈ టెలిఫోన్ అభినందనలు చోటు చేసుకోవడం గమనార్హం. టీడీపీ తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున పొత్తుకు ప్రధాన అడ్డంకి తొలగినట్టేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|