యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష స్పందన
శ్రీకాకుళం, శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 14:27 IST )
ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి చేపట్టిన ప్రజా అంకిత యాత్రకు శ్రీకాకుళం జిల్లాలో విశేష స్పందన కన్పించింది. శ్రీకాకుళం నుంచి రోడ్‌షోకు బయలు దేరిన ఆయన‌కు ప్రజలు దారి పొడవునా నీరాజనాలు పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పుష్కలంగా వనరులున్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ నుంచి వలసలు నిరంతరంగా కొనసాగుతున్నాయన్నారు. మత్స్య సంపద, చేనేత వస్త్రాలకు పేరుపొందిన ఈ ప్రాంతాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజల పిలుపు మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, వారి కష్ట, నష్టాలను పరిష్కరించడమే తన ధ్యేయమన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను వెనుకబాటు తనం నుంచి రక్షిస్తామని అయన అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింస
రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదం
రాజకీయాలంటే దోపిడీ కాదు: చిరంజీవి
శ్రీకాకుళం నుంచి ప్రజా అంకిత యాత్ర ప్రారంభం
ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్దతు: బాబు
శ్రీకాకుళం నుంచి మెగా యాత్రకు సర్వం సిద్ధం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...