యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భక్తుల హింస
కర్నూలు, శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 13:12 IST )
కర్నూలు జిల్లా, హొళగంద మండలం, దేవరగట్టులో జరుగుతున్న బన్ని ఉత్సవాలలో భాగంగా గురువారం అర్థరాత్రి భక్తులు కర్రలతో యుద్ధానికి దిగగా, పలువురికి తలలు పగిలాయి. దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

శ్రీ మాళా మల్లేశ్వరస్వామి జైత్రయాత్రను ఈ బన్ని ఉత్సవాలుగా నిర్వహిస్తున్న భక్తులు స్వామి వారిని తమ గ్రామంలోనే ఉంచుకునేందుకై ఈ కర్రలతో యుద్ధం సాగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి కాక కర్ణాటకనుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు.

అదే క్రమంలో గురువారం రాత్రి కూడా నెరణికి, నెరణికి తాండ, కొత్త పేట గ్రామాల ప్రజలు దేవుడిని ఇతర గ్రామాల వారు తీసుకెళ్లకుండా ఉండేందుకై ఈ యుద్ధం సాగించారు. ఈ సందర్భంగా ఇనుప తీగలు చుట్టిన కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజకీయ లబ్ధికే టీడీపీ తెలంగాణ నాదం
రాజకీయాలంటే దోపిడీ కాదు: చిరంజీవి
శ్రీకాకుళం నుంచి ప్రజా అంకిత యాత్ర ప్రారంభం
ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్దతు: బాబు
శ్రీకాకుళం నుంచి మెగా యాత్రకు సర్వం సిద్ధం
ముగింపు దశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...